Sunday, January 19, 2025
Homeసినిమా29న వస్తున్న ప్ర‌భుదేవా 'మిస్ట‌ర్ ప్రేమికుడు'

29న వస్తున్న ప్ర‌భుదేవా ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్’ త‌మిళ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించి బాక్సాఫీస్ దగ్గర మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులోకి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు  మాట్లాడుతూ “ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన `చార్లి చాప్లిన్` చిత్రాన్ని తెలుగులో ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దిస్తున్నాం. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డ్యాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డ్యాన్స్ ని మ‌రోసారి చేయ‌బోతుంది. సినిమాను ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రించాలని కోరుకుంటున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్