Saturday, May 11, 2024
HomeTrending Newsఉద్యోగాలు భర్తీ చేయాలి: టిడిపి ఆందోళన

ఉద్యోగాలు భర్తీ చేయాలి: టిడిపి ఆందోళన

TDP Protest: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరుద్యోగ సమస్యపై నేడు ఆందోళన చేపట్టారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ బయట నిరసన చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి ఎమ్మెల్యేలు ప్రవేశించే గేట్ వరకూ  ప్లేకార్డులు చేతబూని, నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.

యువతకు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి,  నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేశారని నేతలు ఆరోపించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.

‘జాబులు ఎక్కడ జగన్ రెడ్డీ?’ అని ప్రశ్నిస్తూ… ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్