రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావుకు, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, భరోసాకు ప్రతీక రక్షాబంధన్…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రక్షాబంధన్ సందర్భంగా మంత్రి తలసానికి రాఖీ కట్టిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి సోదరీమణులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడ లోని నివాసంలో రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి కి రాఖీ కట్టిన సోదరి దొడ్ల సత్యవతి..

రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బ్ర‌హ్మ‌కుమారీలు రాఖీలు క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మంత్రికి, క్యాంపు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి మిఠాయిలు పంచారు.తమ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న రాజస్థాన్ లోని మౌంట్ అబూలో సెప్టెంబరులో జరిగే అంత‌ర్జాతీయ యోగా సదస్సుకు హాజరు కావలసిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మ‌కుమారీస్ ప్ర‌తినిధులు వంశీ, మాధ‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

రక్షాబంధన్ పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వనపర్తి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టిన అక్కలు అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ, చెల్లెలు శశిరేఖ.

తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నల్గొండ రెసిడెన్సీ లో రాఖీ పండుగ సంబరాలు.. తమ అభిమాన నాయకునికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళనేతలు. ఈ కార్యక్రమంలో శరణ్య రెడ్డి,దుబ్బారూప,పద్మ,ధనలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.

Also Read : సిఎం కెసిఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *