Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Ultimate Kho-Kho: ఫైనల్లో తెలుగు యోధాస్

Ultimate Kho-Kho: ఫైనల్లో తెలుగు యోధాస్

అల్టిమేట్ ఖో-ఖో లీగ్ తొలి సీజన్లో తెలుగు యోధాస్ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వాలిఫైర్-2 మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై 67-44 తేడాతో విజయం సాధించింది. ఓవరాల్ గా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై క్విక్ గన్స్ పై 61-43 తేడాతో గెలుపొంది  క్వాలిఫైర్-2 కు చేరుకుంది.

మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ జెయింట్స్- ఓడిశా జగ్గర్ నాట్స్ మధ్య జరిగిన క్వాలిఫైర్-1 మ్యాచ్ లో ఓడిశా 57-43 తేడాతో విజయం సాధించి నేరుగా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. శనివారం జరిగిన క్వాలిఫైర్-2 లో గుజరాత్ ను ఓడించి తెలుగు యోధాస్ ఫైనల్స్ కు చేరుకుంది.

ఆదివారం రాత్రి 8 గంటలకు తెలుగు-ఓడిశా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్