Sunday, February 23, 2025
HomeTrending Newsరామతీర్థంలో ఉద్రిక్తత

రామతీర్థంలో ఉద్రిక్తత

Tension at Temple: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పునః నిర్మాణ పనులకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా  ప్రోటోకాల్ పాటించలేదని, తనకు సరైన గౌరవం ఇవ్యవలేదని  అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. పునః ప్రతిష్ట  కోసం ఏర్పాటు చేసిన బోర్డును కింద పడేసేందుకు యత్నించారు. ఆయన్ను అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ గజపతి రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తమాషా చేస్తోందని, రాజ్యంగబద్ధంగా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు.

Also Read : రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

RELATED ARTICLES

Most Popular

న్యూస్