Saturday, January 18, 2025
Homeసినిమా‘అనుకోని ప్రయాణం’ ఫస్ట్ సింగల్ రిలీజ్

‘అనుకోని ప్రయాణం’ ఫస్ట్ సింగల్ రిలీజ్

Unexpected Journey: ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ఏకథను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు మధు కిరణ్ ఆకుట్టునే సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు శివ, కోటి గారి దగ్గర తొమ్మిదేళ్ళు పని చేశారు. శివ మంచి విజయాలు అందుకోవాలి. పాటకు ఆక్సిజన్ నింపే శంకర్ మహదేవన్ గారు ఈ పాటని చాలా బ్రిలియంట్ గా పాడారు. మధు కిరణ్ మంచి సాహిత్యం అందించారు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటులు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. ఈ చిత్రం కూడా మరో మంచి చిత్రం అవుతుందని నమ్మతున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్