Sunday, January 19, 2025
Homeసినిమాయూట్యూబ్ ని షేక్ చేస్తోన్న 'థ్యాంక్యూ' టీజ‌ర్

యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న ‘థ్యాంక్యూ’ టీజ‌ర్

Teaser  Trending: యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న క‌థా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న  రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మనం వంటి క్లాసిక్ తర్వాత నాగచైతన్య – డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 8న థ్యాంక్యూ  మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.

తాజాగా థ్యాంక్యూ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. నా సక్సెస్ కు నేనే కారణం అని చైతూ కోపంగా ఇంగ్లీష్ లో అంటుండగా.. నువ్ సెల్ఫ్ సెట్రిక్ యారోగెంట్ గా మారుతున్నావ్. నీకు తప్ప నీ లైఫ్ లో ఇంకొకరికి చోటే లేదు అని రాశీ ఖన్నా ఏడుస్తూ చెప్పడంతో ప్రారంభమైన ఈ టీజర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఓ వ్యక్తి తన జీవితంలో తప్పులను సరిచేసుకుంటూ.. తనని తాను అన్వేషించుకుంటూ సాగించే ప్రయాణమే థాంక్యూ సినిమా కథాంశమని టీజర్ ని బట్టి తెలుస్తుంది. ఇందులో నాగచైతన్య పాత్రలో మూడు దశలను చూపించారు.

టీనేజ్ లో మాళవిక, కాలేజ్ డేస్ లో అవికా, పరిపక్వత చెందిన దశలో రాశీ ఖ‌న్నాలతో చైతూ ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది. అయితే.. మూడు స్టేజ్ లలో చై గెటప్స్ అండ్ లుక్స్ సూప‌ర్ అనేలా ఉన్నాయి . ఈ టీజ‌ర్ ఇలా రిలీజ్ చేశారో లేదో అలా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. మొత్తానికి టీజ‌ర్ చూస్తుంటే.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తోంది. మ‌రి.. థ్యాంక్యూ ఏ రేంజ్ స‌క్సెస్ సాథిస్తుందో చూడాలి.

Also Read : జూలై 8న నాగ‌చైత‌న్య ‘థ్యాంక్యూ’

RELATED ARTICLES

Most Popular

న్యూస్