కరీంనగర్ పోలీస్ కమిషనర్, IPS అధికారి అయిఉండి ఖాకీ దుస్తులు వదిలి గులాబి దుస్తులు వేసుకున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, ఇప్పటికే ఆ అధికారి పై సభా హక్కుల ఉల్లంఘన కేసు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ లో కుటుంబ పాలన నడుస్తుందని, తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు ఈ రోజు మాతో ఉన్నారని ఆయన అన్నారు. కెసిఆర్ దగ్గర తెలంగాణ ఉద్యమంలో లేని వారు ఉన్నారని విమర్శించారు. బండి సంజయ్ పై తప్పుడు కేసు పెట్టారని రుజువు అయిందని, తెలంగాణలో కలోనియల్ రూల్ నడుస్తుందని మండిపడ్డారు. ఎంత మందిని జైల్లో వేస్తావో వేయు.. ఎంత రాజరికం చూపిస్తావో చూపెట్టు అని కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చిన బిజెపి కొద్దిసేపటి క్రితం ఉపసంహరించుకుంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెంధర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read : G.O 317 తక్షణమే నిలిపివేయాలి-జీవన్ రెడ్డి