7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending Newsమావోయిస్టులకు నర్సీపట్నంలో అంత్యక్రియలు

మావోయిస్టులకు నర్సీపట్నంలో అంత్యక్రియలు

ఛతీష్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నుంచి మహిళా మావోయిస్టు పైకె తల్లి రావడంతో ఆమె మృతదేహాన్ని తల్లికి అప్పగించారు. పొలిస్ , రెవిన్యూ అధికారులు ఆధ్వర్యంలో మావోయిస్టుల మృత దేహాలను సమాధి చేశారు. ఈ నెల 16 తేదీ న కొయ్యూరు మండలంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 6 గురు మృతి చెందారు.ఇద్దరి మృతదేహాల కోసం ఎవరు రాకపోవటంతో నర్సీపట్నం తాసిల్దార్ జయ పోలీస్ అధికారులు సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
శుక్రవారం పోస్టుమార్టం అనంతరం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి చెందిన అశోక్ ఎలియాస్ గంగన్న ,చతీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన మాడీ ముఖేష్ అలియాస్ రణధీర్ , గూడెంకొత్తవీధి గుమ్మరేగుల చెందిన మహిళా మావోయిస్టు లలిత మృతదేహాలను కుటుంబ సభ్యులు తమ స్వగ్రామాలకు తీసుకు వెళ్లారు. నర్సీపట్నం తాసిల్దార్ జయ , మంప ఎస్ఐ సన్నిబాబు , పట్టణ ఎస్ఐ లక్ష్మణరావు మున్సిపాలిటీ సిబ్బంది పలువురు ఈ అంత్యక్రియలల్లో పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్