Friday, May 31, 2024
Homeజాతీయంఏపి, కేరళపై సుప్రీం ఆగ్రహం

ఏపి, కేరళపై సుప్రీం ఆగ్రహం

పరీక్షల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయనందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షలు నిర్వహిచడం ద్వారా ఒక్క మరణం సంభవించినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కరోనా రెండో దశ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం  సి.బి.ఎస్.ఈ. 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బోర్డుల ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. మిగిలిన 4 రాష్ట్రాలూ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నాలుగు రాష్ట్రాల్లో అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ చెప్పలేదు, దీనిపై కోర్టు మండిపడింది. వెంటనే మీ అభిప్రాయం చెప్పాలంటూ ఆయ రాష్ట్రాల తరపున హాజరైన న్యాయవాదులను  ఆదేశించింది. కేరళ తరఫున న్యాయవాది  11వ తరగతి పరీక్షలను సెప్టంబర్ లో నిర్వహిస్తామని తెలిపారు.  ఏపి తరఫు లాయర్ రెండ్రోజుల సమయం కావాలని కోరగా  సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కోర్టుకు నిర్ణయం తెలపాలని ఆదేశించింది, కేసు విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది.

మరోవైపు, సీబీఎస్ఈ,  ఐసీఎస్ఈ , రాష్ట్రాల బోర్డులు పరీక్షలు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్