Friday, March 29, 2024
HomeTrending Newsఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు

ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా పాక్ రెంజేర్స్ ను రాజధాని ముజఫరాబాద్ పంపారు.  ఎన్నికల ఏర్పాట్లు, అక్కడి పరిస్థితులను పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

వచ్చే నెల 25 వ తేదిన 33 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 30 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వచ్చే నెల నాలుగో తేదిన పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయించనున్నారు. ఈ దఫా ఎన్నికలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

భారత్ పరిధిలోని జమ్మూ కాశ్మీర్ విభజించి రెండు రాష్ట్రాలు చేయటం, 370 ఆర్టికల్ రద్దు చేయటం పాకిస్తాన్లో కూడా ప్రకంపనలు సృష్టించింది. దీంతో పిఒకే లో చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మీడియాలో రావటం ఖాయం. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఆక్రమిత కశ్మీర్ ఎన్నికలు కీలకం. ఎన్నికల ఘట్టం పూర్తి అయితే అంతర్జాతీయ వేదికలపై పాక్ గొప్పతనం చెప్పుకొని, ప్రపంచ బ్యాంక్ ప్రాపకం పొందవచ్చనే వ్యూహంలో ఇమ్రాన్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్