Monday, January 20, 2025
HomeTrending Newsవారిద్దరూ రోజూ టచ్ లోనే ఉన్నారు: అంబటి

వారిద్దరూ రోజూ టచ్ లోనే ఉన్నారు: అంబటి

తెలుగుదేశం- జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాబు, పవన్ లు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ ఇద్దరి మధ్యా నాదెండ్ల మనోహర్ బ్రోకరిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిద్దరూ కలవడానికి ఇంత తాపత్రయ పడుతున్నారంటేనే తాము ఎంత బలంగా ఉన్నామో తెలుస్తుందన్నారు. ఈ రెండు పార్టీలే కాదని.. ఇంకా ఎంతమంది కలిసి వచ్చినా రావొచ్చని…79 శాతం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని, మరోసారి వైఎస్సార్సీపీ ధంకా భజాయించి విజయం సాధించాబోతోందని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

నేడు వారిద్దరూ కలుసుకోవడం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని, తెలుడుదేశం పార్టీకి జన సేన అనేది బి టీమ్ లాంటిదని, టిడిపిని కాపాడటానికి పుట్టిందే జనసేన పార్టీ అని రాంబాబు విమర్శించారు. వారు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదని, టిడిపిని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే మాట్లాడుకున్నారని, దానికి బదులుగా ప్రతిఫలం ఏమి ఇవ్వాలనే దానిపైనే చర్చలు జరిగాయన్నారు. ఈ పరిణామాలతో ఎవరైనా ఆశ్చర్యపోవాల్సి వస్తే అది బిజెపి అని, మా పవన్ కళ్యాన్ సిఎం అవుతారని ఎవరు అనుకుంటున్నారో వారు ఆశ్చర్యపోవాలని రాంబాబు చెప్పారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలు సరిగా అందిస్తే చీరల కోసం, నిత్యావసరాల కోసం జగన్ ఎగాబడాల్సిన అవసరం ఏముంటుందని పవన్ వ్యాఖ్యానించడాన్ని రాంబాబు తప్పు బట్టారు. నీ సినిమా హిట్ అయినంత మాత్రాన వేరే సినిమాలు హిట్ కావా అని ఎదురు ప్రశ్నించారు. ఎవరైనా ఏదైనా కానుక పంపిణీ ఇస్తామంటే ప్రజలు వాటి కోసం వస్తారని, అది సహజంగా జరిగేదేనన్నారు.  ఓ వైపున బిజెపితో పొత్తులో ఉంటూ మరోవైపు టిడిపితో లవ్ లో ఉన్న అనైతిక మైన పార్టీ, వ్యక్తీ మీరు అంటూ పవన్ పై విరుచుకు పడ్డారు. ఈ దేశంలో అనైతిక రాజకీయ నేత ఎవరైనా ఉంటే వారిలో నంబర్ వన్ పవన్ అని  అంబటి అన్నారు. మీరు ఎంతమని కలిసి వచ్చినా సిఎం జగన్ మీ అందరినీ కట్ట కట్టి బంగాళాఖాతంలో వేస్తారని రాంబాబు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్