Friday, October 18, 2024
Homeసినిమాతెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా : వరుణ్‌ ధావన్

తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా : వరుణ్‌ ధావన్

వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా (Bhediya). ఈ చిత్రం తెలుగులో తోడేలు (Thodelu) టైటిల్‌తో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ “అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కి ముందుగా థాంక్స్ చెబుతున్నాను. మీరు మాకు ఇన్ స్పిరేషన్. ఈ సినిమాను మీరు తెలుగులో రిలీజ్ చెయ్యడం మాకు చాలా ఆనందంగా ఉంది. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఖచ్చింతగా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాహుబలి తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేశాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అవుతాడు అని నమ్మి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి వచ్చారు. ఫ్యూచర్ లో ఆయన అల్లు అర్జున్ తో సినిమా తియ్యాలని కోరుకుంటున్నాను. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. దీన్ని తెలుగులో విడుదల చేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది” అన్నారు.

వరుణ్‌ ధావన్ మాట్లాడుతూ “హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం. ఇండియాలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ముంబై, హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్