Tuesday, January 21, 2025
Homeసినిమాపవన్, తేజు కోసం ఇన్ని మార్పులా?

పవన్, తేజు కోసం ఇన్ని మార్పులా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో లో “వినోదయ సీతం‘ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చి షూటింగ్ జరుపుకుంటుంది.  సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి తెర వెనుక చక్రం తిప్పింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అంతే కాకుండా ఈ చిత్రానికి సంభాషణలు.. స్క్రీన్ ప్లే కూడా త్రివిక్రమ్ అందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించే బాధ్యతను సముద్రఖనికి ఇచ్చారు. ఆయనో వెర్షెన్ రాశారు కానీ.. అది త్రివిక్రమ్ కి నచ్చలేదట. ఆ తర్వాత బుర్రా సాయిమాధవ్ ని రంగంలోకి దింపారు. ఆయనో వెర్షెన్ రాశారు. అది కూడా త్రివిక్రమ్ కి నచ్చలేదట. అప్పుడు మహేష్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన వెర్షెన్ రాశారు. మన నేటీవిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేశారు. ఈ కథలో మధ్య వయసు పాత్రను తీసేసి ఓ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశారు.

ఆ పాత్రకు తగ్గట్టు హీరోయిన్, లవ్ ఎపిసోడ్ ను జత చేశారట. భాద్యత లేని ఓ కుర్రాడు చనిపోయాక ఎలా బాధ్యత తెలుసుకున్నాడు అనేట్టుగా ఫైనల్ వెర్షన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇక సముద్రఖని ఫైనల్ చేసిన కాస్టింగ్ ను కూడా త్రివిక్రమ్ మార్చేశారని అంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వెర్షెన్ సెట్స్ పైకి వచ్చింది. సో.. ఈ మూవీ సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఆ క్రెడిట్ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కే దక్కుతుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో?

Also Read : పవన్ మూవీకి బాలయ్య టైటిల్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్