Sunday, January 19, 2025
Homeసినిమాచిరంజీవి చేతులు మీదుగా 'వసంత కోకిల' ట్రైలర్ విడుదల

చిరంజీవి చేతులు మీదుగా ‘వసంత కోకిల’ ట్రైలర్ విడుదల

మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ల పై జాతీయ అవార్డు గ్రహీత, బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది. నలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు.

ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు మంచి ఆసక్తికరంగా కట్ చేసారు. బాబీ సింహా-కశ్మీర పరదేశీ లవ్‌ ట్రాక్‌ తో పాటు వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్ధమవుతుంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో రాజేష్ మురుగేషన్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆసక్తిని పెంచాడు. రమణన్‌ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ వసంత కోకిల చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్