మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
చిరంజీవి – రవితేజ పాత్రల మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రవితేజ, చిరంజీవిల పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ నటించనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో వెంకటేష్ కూడా సరదాగా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారట.
ప్రస్తుతానికి ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ… టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త గట్టిగా వినిపిస్తుంది. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చిరు, వెంకీ పై సీన్స్ షూట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. వాల్తేరు వీరయ్య మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.