Thursday, May 9, 2024
HomeTrending Newsఅర్హులకు పోడు భూముల పట్టాలు - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అర్హులకు పోడు భూముల పట్టాలు – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత…. ఒక అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుమ్రం భీం – ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, . ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 140 విడుదలచేసిందని తెలిపారు. , ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్