Sunday, January 19, 2025
HomeTrending Newsత్వరలో 'మూడు' బిల్లు: బాలినేని

త్వరలో ‘మూడు’ బిల్లు: బాలినేని

3 Capitals:

రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని, ఉద్యోగస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయన భరోసా ఇచ్చారు. బాలినేని నేడు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు మూడు రాజధానుల బిల్లు విషయంలో స్పందించారు.

గతంలో ప్రవేశ పెట్టిన బిల్లు లో కొన్ని మార్పులు చేసి సమగ్ర మైన బిల్లు పెట్టేందుకు వీలుగా గతంలో చేసిన బిల్లును ఉపసంహరించుకున్నామని బాలినేని వివరించారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, సమగ్రమైన బిల్లును తీసుకు వస్తామని చెప్పారు.  చంద్రబాబు చేసేవన్నీ రాజకీయాలేనని, లోకేష్ ఓ పప్పు అంటూ బాలినేని వ్యాఖ్యానించారు.

Also Read : మరో బిల్లుతో ముందుకొస్తాం: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్