Sunday, January 19, 2025
Homeసినిమాశ్రీకాంత్ అడ్డాల సినిమాకు పీకేకు సంబంధం ఏంటి..?

శ్రీకాంత్ అడ్డాల సినిమాకు పీకేకు సంబంధం ఏంటి..?

కొత్త బంగారులోకం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత భారీ మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్రహ్మోత్సవం సినిమాతో మెప్పించలేకపోయిన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో యాక్షన్ మూవీస్ కూడా చేయగలడు అని నిరూపించాడు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను జూన్ 2న విడుదల చేయనున్నట్టుగా తెలియచేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

హ్యాష్ టాగ్ పీకే 1 అని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ సినిమాకి పీకేకు సంబంధం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అసలు ఏంటి అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని.. పీకే అంటే పెద్దకాపు అని.. ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ సినిమాని రెండు పార్టులుగా తీయాలి అనుకుంటున్నారట. అందుకనే పీకే 1 అని పెట్టారని సమాచారం. పెద్దకాపు చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండడం విశేషం. గోదావరి జిల్లాల్లో 1980 టైమ్ లో జరిగిన గొడవలు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎంత మాసీవ్ గా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రం ద్వారా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బంధువును హీరోగా పరిచయం చేస్తున్నారట. అఖండ తర్వాత ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న సినిమా ఇది. జూన్ 2 నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని శ్రీకాంత్ అడ్డాల కసితో సినిమా చేస్తున్నారు. నారప్ప సినిమా థియేటర్ లో రిలీజ్ కాలేదు. మరి.. ఈ సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్