శ్రీలంకతో స్వదేశంలో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. రెండు వికెట్లకు 155 పరుగుల వద్ద నేడు రెండోరోజు ఆట మొదలు పెట్టిన కివీస్ మూడో వికెట్ కు 363 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది. కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ పూర్తి చేసి 215 పరుగుల వద్ద ఔటయ్యాడు. డెరిల్ మిచెల్ 17 రన్స్ కు పెవిలియన్ చేరాడు. హెన్రీ నికోలస్ కూడా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వెంటనే కెప్టెన్ సౌతీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ మొదలు పెటిన శ్రీలంక రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఫెర్నాండో-6; కుశాల్ మెండీస్ డకౌట్ అయ్యారు. దిముత్ కరుణరత్నే-16; ప్రభాత్ జయసూర్య-4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కివీస్ 554 పరుగుల ఆధిక్యంలో ఉంది.