Saturday, November 23, 2024

ఇక గడప దాటండి

Companies Ask People Back to Office

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు ఆఫీసులకి రమ్మంటున్నారు. అందుకు చేసుకోవలసిన ముందస్తు ఏర్పాట్లు ఇవి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. సరదాగా చదవండి. రచయిత ఎవరో తెలియదు.

1. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చొక్కా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

2. చొక్కా గుండీలు అన్నీ పద్ధతిగా పెట్టుకోవాలి.

3. ప్రతి గంట గంటకి నెమరు వేసుకునే ఆవులా ఎదో ఒకటి తింటూ ఉండడం మానుకుని, కాస్త నోరు ఆడించకుండా పని చేయడం అలవాటు చేసుకోవాలి.

4. మీటింగ్ అనగానే చుట్టూ ఉన్న వాళ్ళని హుష్ హుష్ అనడం మానుకోవాలి.

5. ఉన్న ఒకటి రెండు వెంట్రుకలను అప్పుడప్పుడు సెలూన్ లో నీట్ గా కట్ చేయించుకోవాలి.

6. సాధు పురుషులం, సత్పురుషులం కాదు కనుక గెడ్డం గీసుకోవడం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.

7. మధ్యాహ్నం భోజనం అవగానే అలా రెండు తలగడలు వెనక్కి వేసి, పడుకుని, లాప్టాప్ ను పొట్ట మీద పెట్టుకుని, నానా దరిద్ర భంగిమల్లో కాకుండా… చక్కగా కూర్చుని లాప్టాప్ ని లాప్టాప్ గా మాత్రమే వాడడం అలవాటు చేసుకోవాలి.

8. కాఫీ ఎవ్వడు తెచ్చి ఇవ్వరు. మనమే కేఫ్ కి వెళ్ళి తెచ్చుకుని తాగాలి. మర్యాదగా ఆ కప్ అక్కడ ఉన్న ట్రేలో వేసేయాలి తప్ప, ఉదయం తాగిన కప్ నుంచి అర్ధరాత్రి కప్ వరకూ ఎదో స్టీలు సామానుల వాడిలా పక్కన ఉంచుకోకూడదు.

9.ఆఫీసులో సినిమాలు వెయ్యరు కనుక, నెట్ ఫ్లిక్, ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, ఊహా, వూట్ లాంటి వాటిని క్రమక్రమంగా తగ్గించుకుడానికి ప్రయత్నం చెయ్యాలి.

అన్నిటికంటే ముఖ్యంగా… ఇలాంటి సూక్తి ముక్తావళి రాసే 5 నిముషాలైనా కూర్చుని రాయడం ముందు ప్రాక్టీస్ చెయ్యాలి.

Also Read:

బ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ తప్పిదాలు

Also Read:

దా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్

Also Read:

అప్పుడు నోరు విప్పలేదే!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్