Saturday, January 18, 2025
Homeసినిమామోక్షజ్ఞ ఎంట్రీ ఉందా? లేదా?

మోక్షజ్ఞ ఎంట్రీ ఉందా? లేదా?

నంద‌మూరి  బాల‌కృష్ణ న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడనేది క్లారిటీ లేదు. మోక్ష‌జ్ఞ తొలి సినిమా ద‌ర్శ‌కుడు అంటూ చాలా మంది పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. బాల‌య్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయాలనుకున్నారు. ఈ సినిమా ద్వారా మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌యం గురించి బాల‌య్య‌ను అడిగితే.. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు పూర్తి వివ‌రాల‌తో అనౌన్స్ చేస్తానన్నారు.

అసలు మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి ఉందా..? లేదా..? అనే అనుమానం క‌లుగుతుంది. ఎందుకంటే కనీసం ఫిట్నెస్ విషయంలో కూడా పెద్దగా ఫోకస్ చేయడంలేదని  అతన్ని చూస్తేనే అర్థమవుతుంది. నందమూరి హీరో ఎంట్రీ మామూలుగా ఉండకూడదని అభిమానులు భావిస్లోతారు, అందునా అఖండ సినిమా తర్వాత బాలయ్య బాబుకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఈ సమయంలో మోక్షాజ్ఞ ఎంట్రీ అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. రీసెంట్ గా మోక్షజ్ఞ పుట్టినరోజు జ‌రిగింది. త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌కు బాలయ్య కేక్ తినిపిస్తున్న ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. అందులోనూ మోక్షజ్ఞ పెద్దగా ఆకట్టుకునే లుక్ లో ఏమీ కనిపించడం లేదు. అతను ఇంకా హీరోగా సిద్ధంగా లేడు అనిపిస్తుంది. మ‌రి.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో..?  బాల‌య్య ఎప్పుడు అనౌన్స్ చేస్తారో..?

Also Read : మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి అనిల్ క్లారిటీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్