Sunday, November 24, 2024
HomeTrending Newsతెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల

తెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడని ప్రజలు కేసీఆర్ చేతిలో పాలన పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని… వందల మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను.. సున్నా వడ్డీ పేరిట మహిళలను… కేజీ టూ పీజీ అంటూ విద్యార్థులని సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అమెరికాలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల… వైఎస్సార్ ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈ రోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తే… కేసీఆర్ ఆ పథకాన్ని బ్రష్టు పట్టించారని ఆరోపించారు. అనేక ఆంక్షలు విధించి.. కేవలం రూ. 35 వేలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అరోగ్య శ్రీ కేసులు ఆసుపత్రులు తీసుకోవడం మానేశాయి. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, మైనారిటీలకు రిజర్వేషన్ ల పెంపు వంటి బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది. అన్ని ప్రాజెక్ట్ లు ఓకే వ్యక్తికి ఇస్తున్నారు. కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రూ. 70 వేల కోట్ల అవినీతి జరిగింది. అవినీతిపై ఢీల్లీ వరకు వెళ్లి పోరాటం చేశాం. రాష్ట్రంలో వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అందడం లేదు. కేసీఆర్ చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేసే వరకు నిరుద్యోగం అనే అంశం చర్చకే రాలేదు. మేము నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం.. అప్పుడు ప్రతిపక్షానికి సోయి వచ్చింది. అధికార పక్షానికి బుద్ది వచ్చింది” అని షర్మిల అన్నారు.

జలయజ్ఞం పథకంలో భాగంగా తెలంగాణలోనే ఎక్కువ ప్రాజెక్ట్ లు కట్టించారని…. ఉచిత విద్యుత్ ద్వారా తెలంగాణలోనే రైతులు ఎక్కువ లబ్ది పొందారని అన్నారు. తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలని నాన్న నా గుండెలపై విల్లు రాశారని… అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించామని వివరించారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్