Sunday, May 26, 2024
HomeTrending Newsపాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

పాలమూరు అక్రమం: అవినాష్ రెడ్డి

విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైఎస్సార్ సీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ ల నుంచి అనుమతి లేకుండానే పాలమూరు రంగారెడ్డి, దిండి నిర్మాణం చేపట్టిందని, వీటితో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు పూర్తయితే శ్రీశైలం వద్ద 800 అడుగుల నీటి మట్టం నుంచే 90 టిఎంసీల నీరు తోడుకునే అవకాశం తెలంగాణకు ఏర్పడుతుందని అయన తెలిపారు. వెంటనే కేంద్రం స్పందించి తెలంగాణపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పాలమూరు పూర్తయితే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు- నగరి, వెలిగొండ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ తాగు నీటికి తీవ్రమైన కొరత ఏర్పతుడుందని తెలిపారు. శ్రీశైలంలో కనీస నీటి మట్టం లేకుండానే ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ విషయమై ప్రధానికి, కేంద్ర జల్ శక్తి మంత్రికి, కేఆర్ఎంబికి ఏపి సిఎం జగన్ లేఖలు రాశారని, కేఆర్ఎంబీ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ఆపలేదని అవినాష్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.

ఈ విషయమై స్పందిస్తూ…. సాగు, తాగు నీటి అవసరాలు తీరిన తరువాతే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఏపి చేసిన ఫిర్యాదులపై కేంద్ర జల శక్తి, కేఆర్ఎంబి పలుమార్లు తెలంగాణా ప్రభుత్వానికి, జెన్ కో కు విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సిందిగా కోరామని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు స్వస్తి పలికేందుకే గెజిట్ విడుదల చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్