Saturday, January 18, 2025
HomeTrending Newsతెరాస ప్రభుత్వం పడిపోవాలని లేదు - కిషన్ రెడ్డి

తెరాస ప్రభుత్వం పడిపోవాలని లేదు – కిషన్ రెడ్డి

కేసీఆర్ చూపెట్టిన వీడియోలో ఏముందో మాకు అర్ధం కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణలో ఏ విషయం ఉన్నా పార్టీ  అధిష్టానమ్ మాతో మాట్లాడుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిజెపి ని తప్పుపడుతూ గురువారం సిఎం కెసిఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి ఈ రోజు స్పందించారు. మాకు తెరాస ప్రభుత్వం పడిపోవాలని లేదని, కేసీఆర్ ముందే రాజీనామా చేస్తా అన్నా మాకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొడుకు కేటిఆర్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నాలని, మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదన్నారు.

స్పెషల్ స్టేటస్ పేరుతో గతంలో టిడిపి సర్కార్ మాపై బురద జల్లిందని, ఇపుడు తెరాస అలానే వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. నేను రోజు వెయ్యి మందితో ఫోటో దిగుతా…బయటి వ్యక్తి ద్వారా బేరసారాలు జరిపే ఖర్మ మాకు లేదన్నారు. అబద్దాల ఆరోపణలతో ఆడియోలు, వీడియోలు చూపుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బిజెపి మొదట్నుంచీ ప్రత్యేక విచారణ కావాలని కోరుతోందని పేర్కొన్నారు. సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో లు ఇచ్చారని, తెరాస పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో ఒక్కరితో నైనా రాజీనామా చేయించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్