Tuesday, February 25, 2025
HomeTrending Newsకీరవాణి, కోట సచ్చిదానంద శాస్త్రిలకు పద్మశ్రీ

కీరవాణి, కోట సచ్చిదానంద శాస్త్రిలకు పద్మశ్రీ

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కోటాలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఆయనతోపాటు  సైన్సు అండ్ ఇంజనీరింగ్ విభాగంలో గణేష్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వర్ రావు….  కళల్లో సివి రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి….  సామాజిక సేవలో సంకురాత్రి చంద్రశేఖర్… ప్రకాష్ చంద్ర సూద్ కు సాహిత్యం, విద్య విభాగంలో పద్మ అవార్డులు వరించాయి.

కోట సచ్చిదానంద శాస్త్రి నాలుగు దశాబ్దాలుగా తన హరికథలతో తెలుగువారిని అలరిస్తున్నారు. అయన కథాగానం చేస్తుంటే పాత్రలు కళ్ళకు కట్టినట్లు కనబడతాయి. ఒకే కథలో నవరసాలనూ ఒవికించే శైలి ఆయన సొంతం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్