Saturday, November 23, 2024
Homeసినిమా'సైంధవ్'కి అదే సమస్య అయిందేమో! 

‘సైంధవ్’కి అదే సమస్య అయిందేమో! 

వెంకటేశ్ తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయనను ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే ఏదో ఒక సినిమా చేసేయాలనే ఆత్రుత అవసరం లేని సీనియర్ హీరో ఆయన. అలాంటిది ఆయన 75వ సినిమా కథ విషయంలో ఇంకెంత శ్రద్ధ పెట్టి ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. ఏదో బలమైన విషయం .. ఇంట్రెస్టింగ్ లైన్ ఉండే ఉంటుందని అంతా అనుకున్నారు. అలా అభిమానుల ఎదురుచూపుల మధ్య ఈ నెల 13వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది.

సాధారణంగా వెంకటేశ్ సినిమాల్లో ఎంటర్టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. కామెడీతో పాటు హిట్ సాంగ్స్ ను ఆయన సినిమాల నుంచి అభిమానులు ఆశిస్తారు. కానీ అందుకు భిన్నమైన కంటెంట్ ను వెంకటేశ్ ఈ సారి ఎంచుకున్నారు. ఒక అరుదైన వ్యాధితో బాధపడే తన కూతురును కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటంగా ఈ కథ నడుస్తుంది. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, భారీతనం పరంగా ఏ మాత్రం తగ్గలేదు. కానీ ప్రధానమైన అంశాలుగా కనిపించే యాక్షన్ – ఎమోషన్  కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.

చిన్నపిల్లలు జబ్బున పడటం .. వాళ్లు బ్రతుకుతారో తెలియని టెన్షన్ .. హాస్పిటల్లో జరిగే హడావిడిని చూడటానికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడరు. పిల్లలను హాస్టల్ కి తీసుకెళ్లడం వేరు .. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం వేరు. ఇక యాక్షన్ సీన్ ఎంత భారీగా ప్లాన్ చేసినా, దానికంటూ ఒక నిడివి ఉంటుంది. అది దాటితే చిరాకు పుడుతుంది. ఈ కథ విషయంలో అదే జరిగింది. ‘విక్రమ్’ సినిమాను చూసి దర్శకుడు ప్రేరణ పొంది ఉండొచ్చునేమో. ఆ సినిమా కూడా ఎక్కువగా ఆర్ ఆర్ పైనే ఆధారపడిందనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్