రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27న మంగళవారం తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు అయన తిరుమల వస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అనతరం అలిపిరి వద్ద టిటిడి ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి తిరుమల చేరుకుంటారు.
మంగళవారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలోనే బస చేసే సిఎం బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు.
బుధవారం ఉదయం పరకామణి భవనంతో పాటు రాజ్య సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ ను సిఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుపతి, రేణిగుంట చేరుకొని కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళతారు.