Saturday, March 1, 2025
HomeసినిమాAkhil - Anil: ప్రభాస్ చేయాల్సిన మూవీ అఖిల్ చేస్తున్నాడా.?

Akhil – Anil: ప్రభాస్ చేయాల్సిన మూవీ అఖిల్ చేస్తున్నాడా.?

ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సంవత్సరంలో ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఆతర్వాత ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో మూవీ విడుదల కానున్నాయి. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అయితే.. ప్రభాస్ తో సినిమా చేసేందుకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పటికీ కుదిరింది. త్వరలో దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ సినిమాని అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ తో మూవీ అనుకుంటే.. అఖిల్ తో సెట్ అయ్యిందని ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే… యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన అనిల్ ఓ కథ చెప్పాడట. అది నచ్చడంతో ఆ కథతో ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకున్నారట. అయితే.. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ తో అనిల్ సినిమా చేయడం కరెక్ట్ కాదని అనుకున్నారట. ఆ కథను అఖిల్ కి వినిపిస్తే.. వెంటనే చేస్తానన్నాడట. ఆ విధంగా ప్రభాస్ తో అనుకున్న మూవీ అఖిల్ కి సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ నుంచి ఈ సినిమాని ప్రారంభించనున్నారని సమాచారం. ఏజెంట్ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ మూవీ విషయంలో అఖిల్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఏజెంట్ ఫ్లాప్ అయినప్పటికీ ఇక గ్యాప్ తీసుకోకుండా పక్కా ప్లానింగ్ తో మంచి కంటెంట్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. మరి.. అఖిల్ ఆశించిన విజయాన్ని ఈ సినిమా అయినా అందిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్