పశ్చిమ దేశాల్లో మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు వివిధ దేశాలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికాలో వ్రుత్తి నైపుణ్యం కలిగిన ఉద్యోగం చేసే వారికి కెనడా గాలం వేసింది. హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దేశంలోనూ మూడేండ్లు ఉద్యోగం చేసుకోవచ్చని కెనడా ప్రకటించింది.
దీంతోపాటు వీసాదారుల కుటుంబ సభ్యులు ఉద్యోగం, విద్యాభ్యాసం చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. ఈ నెల 16 నుంచి ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఆఫర్‌కు భారీ స్పందన లభించడంతో రెండు రోజులకే ఐఆర్‌సీసీ పోర్టల్‌లో దరఖాస్తుల స్వీకరణను నిలిపేశారు. అదనపు దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు.