Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య అన్ స్టాప‌బుల్ క్రేజీ అప్ డేట్

బాల‌య్య అన్ స్టాప‌బుల్ క్రేజీ అప్ డేట్

నందమూరి  బాలకృష్ణ ‘అన్ స్టాప‌బుల్‘ టాక్ షో చేయ‌డం..  ఈ షో సూప‌ర్ స‌క్సెస్ అవ్వ‌డంతో సెకండ్ సీజ‌న్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం ‘ఆహా’లో ప్రసారమైన ఈ క్రేజీ షో ద్వారా తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ తన అత్యద్భుత  టాలెంట్ తో షోకి మంచి జోష్ తీసుకువచ్చారు.

ఇక పలువురు సినీ సెలెబ్రిటీస్ ఈ షోకి ప్రత్యేక గెస్ట్ లు గా విచ్చేసి తమ తమ సినీ, వ్యక్తిగత విషయాలను షో ద్వారా ఫ్యాన్స్ తో ఆడియన్స్ తో పంచుకోవడం జరిగింది. ఇక ఈ షోకి అప్పట్లో భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అతి త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 2 స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ సెకండ్ సీజ‌న్ కోసం థీమ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

మొదటి సీజన్ ని మించేలా మరింత జోరుతో క్రేజీగా సీజన్ 2 సాగనుందని, ఆ విధంగా ఆహా వారు ప్లాన్ చేసారని తెలుస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సీజ‌న్ లో గెస్ట్ గా అనుష్క కూడా రానుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఈ సెకండ్ సీజ‌న్ తో బాల‌య్య ఎవ‌రెవ‌ర్ని ఇంట‌ర్ వ్యూ చేస్తారో..?  ఎలాంటి విష‌యాలు రాబ‌డ‌తారో..?  అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : బాల‌య్య అన్ స్టాప‌బుల్-2 ఎప్పుడు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్