Sunday, January 19, 2025
Homeసినిమామ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ టైటిల్

మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ టైటిల్

Title News: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, సునీల్, అంజ‌లి.. ఇలా భారీ తారాగ‌ణం ఉండ‌డంతో ఈ సినిమా పై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. అలాగే ఈ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి అధికారి, స‌ర్కారోడు అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ మూవీ టైటిల్ వార్త‌ల్లోకి వ‌చ్చింది. కార‌ణం ఏంటంటే..  అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా అధికారి అనే టైటిల్ ను  ఖ‌రారు చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవలే దిల్ రాజు అధికారి అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్ట్రర్ చేయించారని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా టైటిల్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు.. ఇంకా కొన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి సోషల్ మెసేజ్ తో ఉంటుందని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. చ‌ర‌ణ్, శంక‌ర్ క‌లిసి బాక్సాఫీస్ ని ఏ రేంజ్ షేక్ చేస్తారో చూడాలి.

Also Read : ఎన్టీఆర్, శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ చేస్తున్న దిల్ రాజు..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్