Saturday, January 18, 2025
Homeసినిమాసంక్రాంతికి బ‌రిలో ఏజెంట్?

సంక్రాంతికి బ‌రిలో ఏజెంట్?

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు, అనిల్ సుంక‌ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య, మరో కీలక పాత్రలో  మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పోషిస్తున్నారు.  హిప్ హాప్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాను తొలుత ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయాలనుకున్నారు కానీ.. షూటింగ్ ఇంకా పూర్తికాక‌పోవ‌డంతో వాయిదా ప‌డింది.  ఆ తరువాత దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ద‌స‌రాకి కూడా రావ‌డం లేదు. డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుంద‌ని టాక్ వ‌చ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. సంక్రాంతి ఏజెంట్ మూవీని రిలీజ్ చేస్తే బాగుంటుందని మేక‌ర్స్ ఆలోచిస్తున్నార‌ట‌. పండ‌గ సీజ‌న్లో రిలీజ్ అయ్యే సినిమాలు స‌హ‌జంగానే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌డుతుంటాయి. అందుచేత ఏజెంట్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తేనే బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట మేక‌ర్స్.

Also Read : ఏజెంట్ నిర్మాత ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్