Sunday, January 19, 2025
Homeసినిమా50 మిలియన్ వ్యూయింగ్‌ మినిట్స్ సాధించిన 'అహ నా పెళ్ళంట'

50 మిలియన్ వ్యూయింగ్‌ మినిట్స్ సాధించిన ‘అహ నా పెళ్ళంట’

‘జీ5’లో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్ళంట‘. న‌వంబ‌ర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. ఓ పాతికేళ్ల యువ‌కుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే.. ఆక్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మ‌స్యలు ఏంటి అనేదే అస‌లు క‌థ‌. మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమికుడుతో వెళ్లిపోతుంది. అప్పుడు మ‌న హీరో ఆమె పై ప్ర‌తీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ 50 మిలియ‌న్ వ్యూయింగ్‌ మినిట్స్ మార్క్‌ను రీచ్ అయ్యింది. అంతే కాకుండా ఐఎండీబీ ప్ర‌క‌టించిన టాప్ టెన్ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు ద‌క్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాష‌ల్లో ప్ర‌మోట్ చేశారు. కంటెంట్ చాలా బావుంద‌ని అన్నీ చోట్ల నుంచి సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ‘అహ నా పెళ్ళంట’ .. అతి కొద్ది స‌మ‌యంలోనే 50 మిలియ‌న్ వ్యూయింగ్‌ మినిట్స్ సాధించి కామెడీ వెబ్ సిరీస్‌ల‌లో ఓ రికార్డ్‌ను నెల‌కొల్పింది.

సినీ విమ‌ర్శ‌కులు సైతం వెబ్ సిరీస్ బావుంద‌ని అప్రిషియేట్ చేశారు. అలాగే ఆడియెన్స్ కూడా అభినందిస్తున్నారు. హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అంద‌రూ అంటున్నారు. హీరో, హీరోయిన్ జోడీ మ‌ధ్య ఉండే కెమిస్ట్రీతో పాటు క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ చ‌క్క‌గా కుటుంబం అంతా క‌లిసి చూసేలా ఉంద‌ని అంద‌రూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డ‌పాలని అనుకుంటే వెంట‌నే అహ పెళ్ళంట సినిమా చూసేయండి.

Also Read : రాజ్‌తరుణ్‌, శివాని ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్