Saturday, January 18, 2025
HomeTrending Newsకాంగ్రెస్ సారధ్యంపై తేల్చని రాహుల్...నేతల్లో టెన్షన్

కాంగ్రెస్ సారధ్యంపై తేల్చని రాహుల్…నేతల్లో టెన్షన్

కాంగ్రెస్ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని కలవరపరుస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలు చెప్పటేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు. దీంతో పార్టీలో అయోమయం పెరుగుతోంది. గాంధి యేతర కుటుంబం వారికి పార్టీ అధ్యక్ష పదవి అప్పచేప్పాలని రాహుల్ వాదనగా ఉంది. అందుకే సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టకూడదని, సోనియా స్థానంలో గాంధీయేతర వ్యక్తి ఆ పదవిని చేపట్టాలని రాహుల్ కోరుతున్నారు. రాహుల్‌ను ఒప్పించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ప్రియాంకను రెండో ఎంపికగా పరిగణించింది. లేని పక్షంలో పార్టీ ఐక్యత కోసం 2024 వరకు ఉండాల్సిందిగా సోనియా గాంధీని కోరనున్నట్టు సమాచారం. చివరకు అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కుమారి శైలజ, ముకుల్ వాస్నిక్ వంటి నేతల పేర్లలో ఒకరి పేర్లను అంగీకరించే ప్రయత్నం కూడా జరగొచ్చు. అయితే దీనిపై పార్టీలో ఏకాభిప్రాయం లేదు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ సుముఖంగా లేనందున ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాంకేతికంగా ఆదివారం నుంచే ప్రారంభమైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని చూస్తే గాంధీ కుటుంబానికి రాబోయే కొద్ది రోజులు చాలా ముఖ్యమైనవి.

ఆగస్టు 20 వరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల అథారిటీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం అథారిటీ ఛైర్మన్ మదుసూదన్ మిస్త్రి వేచి చూస్తున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీలను నిర్ధారిస్తే.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల అథారిటీ అదే విషయాన్ని తెలియజేస్తుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో జరిగే నిర్ణయం కోసం అందరు వేచి చూస్తున్నారు.

పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 148 రోజుల పాదయాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. 5 నెలల యాత్ర 3,500 కిలోమీటర్ల దూరం సాగనుంది. 12 కంటే ఎక్కువ రాష్ట్రాలను కవర్ చేయడానికి షెడ్యూల్ అయ్యింది. పాదయాత్ర ప్రతిరోజూ 25 కి.మీ సాగనుంది.

 

ఈ యాత్రలో బహిరంగ సభలు కూడా ఉంటాయి. వీటికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల పోరాటాల కోసం పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్రను చేపట్టారు.

రాహుల్ గాంధీ ఈ రోజు (ఆగస్టు 22)న ఢిల్లీలో పౌర సమాజం, సంస్థలతో సమావేశమై వారి సమస్యలను వినడానికి, వారి ఆలోచనలను పంచుకుంటారని వర్గాలు తెలిపాయి. గాంధీ తన భారత్ జోడో యాత్ర, దాని ఉద్దేశాన్ని కూడా చర్చిస్తారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై కూడా విభిన్న వర్గాలతో చర్చిస్తున్నారు. భారత్ జోడో యాత్రకు ముందు సమాజంలోని వివిధ వర్గాల కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులను కలుస్తున్నారు.

Also Read: ఎంపి కోమటిరెడ్డికి రేవంత్ బేషరతు క్షమాపణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్