Sunday, January 19, 2025
Homeసినిమావారం ముందే వస్తున్న 'పుష్ప’

వారం ముందే వస్తున్న ‘పుష్ప’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు రికార్డులను తిరగ రాశాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు.

పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. డిసెంబర్ 17న పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తామని ప్రకటించారు, కానీ ఎనిమిది రోజుల ముందుకు విడుదల తేదీని మార్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్