Sunday, February 23, 2025
HomeTrending Newsనేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

Budget Sessions: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి మొదలు కాయిన్నాయి. మొదటిరోజున రాష్ట్ర గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ 8వ తేదీకి వాయిదా పడుతుంది. అనంతరం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. సభను ఎంనురోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.

8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సభ సంతాపం తెలియజేయనుంది. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడుతుంది. మార్చి 11న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ 2022-23 వార్షిక బడ్జెట్ ను సభ ఆమోదానికి సమర్పిస్తారు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి మార్చి నెలాఖరువరకూ 20 పనిదినాలు సభ జరిగే అవకాశం ఉందని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్