Saturday, January 18, 2025
HomeTrending Newsతాగుబోతులపై అప్పులా?: ఆనందబాబు

తాగుబోతులపై అప్పులా?: ఆనందబాబు

తాగుబోతులను తాకట్టు పెట్టి ఇప్పటికే 25వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారని, మరో 30వేల కోట్లు తెచ్చుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.  దశలవారీగా మద్యపాన నిషేధం చేశామన్నవారు  రాష్ట్రంలో 840 బార్లకు 2025వరకూ ఎలా లైసెన్స్ ఇస్తారని ప్రశ్నించారు.  దేశంలో అన్ని చోట్లా డిజిటల్ లావాదేవీలు నడుస్తుంటే రాష్ట్రంలో మద్యాన్ని మాత్రం నగదు ద్వారానే విక్రయిస్తున్నారని, దీని వెనుక మర్మమేమిటని నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మద్యపాన నిషేధం అంశం తమ పార్టీ మేనిఫెస్టో లో లేదంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆనందబాబు ఖండించారు. ఇలా అబద్ధాలు మాట్లాడడం తగదన్నారు. సిఎం జగన్ ఓ పధ్ధతి ప్రకారం మద్యం అంశంపై మత్రులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి కోసం, మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం కోసం ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పులు తెచ్చారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం 106 బ్రాండ్లు కొత్తవి తెచ్చారని వివరించారు. గతంలో డిస్టిలరీలు నడుపుతున్న వారందరినీ బెదిరించి వాటిని వైసీపీ నేతలు చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు.

అక్రమ మద్యంతో లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారని, తమ వైద్యం కోసం అపులు చేసి ఆర్ధికంగా చితికి పోతున్నారన్నారు.  ముఖ్యమంత్రి స్వయంగా తన బినామీలను  పెట్టి మద్యం వ్యాపారం నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు.  ఏపీలో అమ్ముతున్న మద్యంలో హానికర పదార్ధాలు ఉన్నాయని చెన్నై లోని ఎస్జీఎస్ కంపెనీ నివేదిక ఇచ్చినా ఈ ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు.

Also Read అశుభంతో పాలన మొదలైంది: అచ్చెన్న

RELATED ARTICLES

Most Popular

న్యూస్