Saturday, January 18, 2025
Homeసినిమానాగ్ ప్లేస్ లో బాలయ్య?

నాగ్ ప్లేస్ లో బాలయ్య?

కింగ్ నాగార్జున ఓవైపు వెండితెరపై సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై బిగ్ బాస్ అంటూ ఆకట్టుకుంటున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే రియాల్టీ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన స్టైల్ లో హోస్ట్ గా చేసి సక్సెస్ సాధించారు. దీని తర్వాత బిగ్ బాస్ షో హోస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, 2కి నేచురల్ స్టార్ నాని  హోస్ట్ లుగా చేశారు. ఇక సీజన్ 3 నుంచి బిగ్ గతవారం ముగిసిన సీజన్ 6 వరకు నాగార్జునే హోస్ట్ గా చేస్తూ వచ్చారు.

బిగ్ బాస్ కు ఏటా నాలుగు నెలలు కేటాయించడంతో సినిమాలపై ఎక్కువగా  దృష్టి పెట్టలేకపోతున్నాడట. అందుకనే ఇక నుంచి బిగ్ బాస్ చేయకూడదని నాగార్జున నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మా టీవీ యాజమాన్యానికి చెప్పారట. దీంతో బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా చేయడం కోసం సీనియర్ హీరోలు, స్టార్ హీరోలను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… బిగ్ బాస్ 7కు హోస్ట్ గా నట సింహం నందమూరి బాలకృష్ణ చేయనున్నారని తెలిసింది.

బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ 7కు బాలయ్య హోస్ట్ అయితే బాగుంటుందని కాంటాక్ట్ చేశారట. బాల‌య్య బిగ్ బాస్ చేయడానికి ఓకే చెప్పార‌ని టాక్‌ వినిపిస్తోంది. బిగ్ బాస్ కు ఇప్పటి వరకు హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నాని, నాగార్జునలకు ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే.. ఎక్కువ రెమ్యూనరేషన్ బాలయ్యకు ఆఫర్ చేశారట. అందుకే బాల‌య్య ఈ షో చేయ‌డానికి ముందుకొచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. బాల‌య్య ఈ షో చేయ‌డానికి కొన్ని కండీష‌న్లు పెట్టార‌ని, అందులో భాగంగానే వేదిక అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి.. మ‌రో చోటికి మారే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరి.. అన్ స్టాపబుల్ టాక్ షోతో ఆకట్టుకున్న బాలయ్య.. బిగ్ బాస్ షోతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో..?  ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో..?  చూడాలి.

Also Read : బిగ్ బాస్ షో పై హైకోర్టు విచారణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్