Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్చెన్నై పై రాజస్థాన్ గెలుపు

చెన్నై పై రాజస్థాన్ గెలుపు

RR in 2nd:  రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బ్యాట్ తో సత్తా చాటి  23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో రాజస్థాన్ నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఐదు వికెట్లతో విజయం సాధించింది.  దీనితో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్  రెండో స్థానంలో నిలిచింది. చెన్నై ఓటమితో ఈ ఐపీఎల్ సీజన్ ముగించింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ధోనీ సేన కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే విజయాలు సాధించింది.

ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద రుతురాజ్ (2) ఔటయ్యాడు.  రెండో వికెట్ కు డెవాన్ కాన్వే- మొయిన్ అలీ 83 పరుగులు జోడించారు. కాన్వె 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొయిన్ అలీ 57 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్లతో 93 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్. ఒబెద్ మెక్ కే చెరో రెండు; బౌల్ట్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

రాజస్తాన్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 తో రాణించగా, జోస్ బట్లర్ (2); దేవదట్ పడిక్కల్ (3); హెట్మెయిర్ (6); కెప్టెన్ సంజూ శాంసన్ (15) విఫలమయ్యారు. ఈ స్థితిలో రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో నిలదొక్కుకుని, ధాటిగా ఆడడంతో మరో రెండు బంతులుండగానే రాజస్థాన్ విజయం సాధించింది.

చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి రెండు, సిమర్జీత్ సింగ్, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రవిచంద్రన్ అశ్విన్ కే ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : రేసులో నిలిచిన బెంగుళూరు: గుజరాత్ పై గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్