Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య అన్ స్టాప‌బుల్ 2 అప్ డేట్

బాల‌య్య అన్ స్టాప‌బుల్ 2 అప్ డేట్

Unstoppable: నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా మారి చేసిన టాక్ షో అన్ స్టాపబుల్. ఆహాలో ప్ర‌సారం అయిన ఈ టాక్ షో సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అస‌లు బాల‌య్య నుంచి ఇలాంటి టాక్ షో వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 1 ముగింపు సందర్బంగానే ఖచ్చితంగా ఇది కామా మాత్రమే.. త్వరలోనే మళ్లీ వస్తా అన్నట్లుగా బాలయ్య చెప్పారు.

ఇటీవలే ఆహా టీమ్ సీజన్ 2 కు సంబంధించిన ప్రకటన చేసింది. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఆగస్టు నుండి అన్ స్టాపబుల్ షో ను ప్రారంభించబోతున్నట్లుగా ఆహా టీమ్ నుండి సమాచారం అందుతోంది. ఈ సీజన్ పై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడు అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంతే కాకుండా ఇంకా పలువురు స్టార్ హీరోలు కూడా ఈసారి బాలయ్య తో కూర్చుని ముచ్చట్లు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇప్పటికే సెట్ వర్క్ ప్రారంభం అయ్యింది. త్వరలోనే మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ లో బాలయ్య పాల్గొంటారు అనే సమాచారం అందుతోంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. గోపీచంద్ మలినేని మూవీ ఎన్ బీ కే 107 సినిమా కోసం బాల‌య్య‌ టర్కీ వెళ్లారు. బాలయ్య త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి అన్ స్టాపబుల్ షో లో పాల్గొంటార‌ని స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్