Sunday, January 19, 2025
Homeసినిమాఏపీ సిఎం జగన్ ని కలిసిన 'ఆటో రజనీ' టీమ్

ఏపీ సిఎం జగన్ ని కలిసిన ‘ఆటో రజనీ’ టీమ్

Movie team: శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఆటో రజిని’. ఈ చిత్ర యూనిట్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని, ఎంపీ నందిగం సురేష్ అధ్వర్యంలో కలసి మూవీలోని కొన్ని సన్నివేశాలను చూపించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. నందిగం సురేష్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.

ఈ సినిమా కి సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యుల్ ను ఇటీవల విజయవాడలో చిత్రీకరించారు. నందిగం, హరి జొన్నలగడ్డ కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో సన్నివేశాలను పూర్తి చేశారు.  అలాగే ‘నాటు నాటు’ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అధ్వర్యంలో 150 మంది డాన్సర్లతో ఓ పాటను చిత్రీకరించారు. జూన్ 10 నుంచి మరొక షెడ్యుల్ ను విజయవాడ లో జరుపనున్నారు. జూలై 10 నుంచి  క్లైమాక్స్ సన్నివేశాలను నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో  జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ “మా ఆటోరజినీ సినిమా షూటింగ్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఏపి ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.  ఏపి సిఎం జగన్ గారిని కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. సినిమా షూటింగ్ లకు ఏపి అనువైన ప్రదేశం. మంచి లోకేషన్స్ వున్నాయి. మా షూటింగ్ కి ఎక్కడ చిన్న అవాంతరం లేకుండా ఏపి ప్రభుత్వం సహకరించింది అందుకు జగన్ గారిని కలసి కృతజ్ఞతలు తెలిపాం. అలాగే నా మీద నమ్మకంతో మా హీరో హరి మీద అభిమానంతో ఈ సినిమాలో ఎంపీ నందిగం సురేష్ అన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ భారీ షెడ్యుల్ ను విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్య సాధన దీక్ష చేసిన ప్రాంతంలో జరిపాం”

“ముఖ్యంగా వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి , ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం గార్లు ఇచ్చిన సహకారం మరువలేనిది. మాకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖ వారికి, జీ వి ఎమ్ సి వారికి థాంక్స్. ఇప్పటి వరకు 50 పర్సెంట్ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది” అన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్