Challenge: ఒక ఆరునెలలు సిఎం జగన్ తమను వదిలిపెడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఉండేవాళ్లమని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో బాబు తమను రౌడీలు అంటూ మట్లాడడంపై జయరాం మండిపడ్డారు. కర్నూల్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందని, ఒక బోయ కులానికి చెందిన వ్యక్తీ మంత్రిగా ఉండదాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని, ఒక బోయవాడు బెంజ్ లో తిరిగితే ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. 2012లోనే తాను హమ్మర్ ఎక్స్ 2 బండిలో బెంగుళూరులో తిరిగానని అన్నారు. తన నియోజకవర్గంలో అసలు ఇసుకే లేదని, తాము ఆదోని నించి తెచ్చుకుంటామని అలాంటిది ఇసుక మంత్రి అంటూ విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. తమ ఆలూరు కర్నాటక బోర్డర్ లో ఉందని, అక్కడికి వెళ్లి తాగి వచ్చే వారిని తాము ఎలా ఆపగాలుగుతామని మంత్రి నిర్వేదం వ్యక్తం చేశారు. తాను అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నలు నిరూపిస్తే సగం మీసం తీసేసుకొని తిరుగుతామని, లేకపోతే బాబు కూడా అలాగే చేస్తారా అని సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా బీసీలు గుర్తుకు వచ్చారని, తమ హాయంలో బీసీలకు పెద్ద పీట వేశామని ఆయన చెబుతున్నారని, ఎప్పుడు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు గోచీలు అంటూ అపహాస్యంచేశారని బాబునుద్దేశించి జయరాం అన్నారు. వాల్మీకి కులస్తులు వాల్కీకి లాగ, కురుబాలు కనకదాసులాగా సిఎం జగన్ ను భావిస్తారని, ఆయా కులాలకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.
Also Read: రాయలసీమ ద్రోహి చంద్రబాబు :హఫీజ్ ఖాన్