కార్తికేయ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. పెద్ద బ్యానర్లలో సినిమాలను చేసినప్పటికీ .. కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆయన కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. సరైన కథలను ఎంచుకోకపోవడం వల్లనే తనకి సక్సెస్ పడటం లేదనీ .. ఇకపై కథల ఎంపిక విషయంలో తొందరపడనని ఒక వేదిపై చెప్పాడు కూడా. ఆ తరువాత కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన ఒక కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చేసిన సినిమానే ‘బెదురులంక 2012’.
కార్తికేయ గ్యాప్ తీసుకుంటే .. ఈ సారి పెద్ద డైరెక్టర్ ను .. కాస్త భారీ తారాగణం ఉన్న సినిమాను ఎంచుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన తాను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే తక్కువ బడ్జెట్ కథను ఓకే చేసుకోవడం ఆడియన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్ కొడుతోంది గనుక, అలా ఈ సినిమా సక్సెస్ ను అందుకునే ఛాన్స్ ఉందని భావించారు. కానీ ఆ స్థాయికి ఈ సినిమా వెళ్లలేకపోయింది.
అలాంటి ఈ సినిమా ముందుగా ఎలాంటి ఎనౌన్సుమెంటులు లేకుండానే అమెజాన్ ప్రైమ్ కి వచ్చేసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ కథ 2012లో నడుస్తుంది. కలియుగం అంతరించిపోయే సమయం ఆసన్నమైపోయిందనే ప్రచారం ‘బెదురులంక’ అనే గ్రామాన్ని తాకుతుంది. ఇకపై తాము బ్రతకమని నిర్ధారించుకున్న ఆ గ్రామస్థులు ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనేదే కథ. కామెడీ ప్రధానంగా నడిచే ఈ కథ, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కుతెచ్చుకుంటుందో చూడాలి.