Friday, October 18, 2024
HomeTrending Newsపెన్షనర్లకు ఏం సమాధానం చెబుతారు?: బొత్స

పెన్షనర్లకు ఏం సమాధానం చెబుతారు?: బొత్స

ప్రతినెలా వచ్చినట్లే ఈరోజు కూడా ఉదయం తెల్లవారకముందే పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన అవ్వ తాతలకు నిరాశ మిగిలిందని, దీనికి విపక్షాలు ఏం సమాధానం చెబుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని  అర్ధం చేసుకోవాలన్నారు. వాలంటీర్ల విషయంలో మొదటినుంచీ చంద్రబాబుకు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే నేడు ఈ సమస్య ఏర్పడిందని… ఇది చాలా తప్పని, దేవుడు కూడా క్షమించబోడని వ్యాఖ్యానించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని మానవత్వం కూడా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 1 సందర్భంగా ప్రజలను తెలుగుదేశం ఫూల్స్ గా చేస్తోందని, ఈ వ్యవస్థపై ఫిర్యాదు చేయించింది వారేనని… మళ్ళీ ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నామ మార్గాలు చూడాలంటూ ఈసీకి చంద్రబాబు లేఖ రాయడం మరో మోసామన్నారు. చేయాల్సింది అంతా చేసి ఇపుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడారు.

వైసీపీకి ప్రచారకర్తలుగా ఉంటారని… అందుకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించవద్దని పలువురు చేసిన ఫిర్యాదులకు స్పందించిన ఎన్నికల సంఘం ఈ విధమైన ఆదేశాలు ఇచ్చిందని, ప్రత్యామ్నాయ  మార్గాలు చూసుకోవాలని చెప్పడం కూడా సరికాదని, ఇప్పటికిప్పుడు అది ఎలా సాధ్యమని బొత్స నిలదీశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించాలని చెబుతున్నారని… వారు కూడా తాము  నియమించిన ఉద్యోగస్తులే కదా… అంటే వారు మాకు ప్రచారం చేయరని భావిస్తున్నారా అని అడిగారు.  రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు టిడిపి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్