Saturday, November 23, 2024
HomeTrending Newsకులాల పేరుతో రాజకీయాలు - గుత్తా ఆవేదన

కులాల పేరుతో రాజకీయాలు – గుత్తా ఆవేదన

కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నదని, కేంద్రం రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రల అస్తిత్వాన్ని దెబ్బతీయలని కేంద్రం చూస్తుంది.రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కుట్ర చేస్తున్నది. పైగా రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ పరువు పోయేలా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర సర్కార్ ఫెడరల్ వ్యవస్థ కు తూట్లు పొడుస్తూ వ్యవహరిస్తోందన్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇవ్వాళ కులాల మీద మాట్లాడుతున్నారని, అధికార యావ తప్ప వారికి వేరే ప్రాధాన్యం లేదని విమర్శించారు. అధికారంలోకి రావాలి దోచుకోవాలి అన్నదే ప్రతిపక్షల లక్ష్యంగా కనిపిస్తుందని, సమైక్యాంధ్రలో నాబార్డ్ లోన్ కూడా ఆంధ్ర ప్రాంతానికి దోచుకొని పోయారని గుర్తుచేశారు. కొన్ని దుష్ట శక్తులు కులాల పెరు చెప్పుకొని అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారని, ప్రజలు ఎప్పుడు కుల రాజకీయాలను నమ్మరు.అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓట్లు వేస్తారని గుత్తా అన్నారు.

స్వప్రయోజనాల కోసం కులాలను వాడుకోవడం దుర్మార్గం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగింది.ఇతర ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తారు ఆకు అయ్యేదన్నారు. ప్రజలు ప్రతిపక్ష నాయకుల మాయ మాటలు నమ్మొద్దు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్థసారథి రెడ్డి హెటిరో ఫార్మాతో దేశ విదేశాల్లో కంపెనీలు పెట్టి దేశ అభివృద్ధికి పాటు పడ్డారని చెప్పారు. రేపు ప్రధాని మోడీ రాష్టానికి వస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేలా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం,తెలంగాణకు ఇబ్బంది కలుగకుండా చూడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.

Also Read : తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు – మంత్రి హరీష్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్