Thursday, April 18, 2024
HomeTrending Newsసమాధానం చెప్పు జగన్ : బాబు ప్రశ్న

సమాధానం చెప్పు జగన్ : బాబు ప్రశ్న

అనంతపురం జిల్లా రాప్తాడులో నేడు వైఎస్సార్సీపీ రాయలసీమ ప్రాంత కార్యకర్తల సదస్సు ‘సిద్ధం’ బహిరంగసభ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా సిఎం జగన్ కు ప్రశ్నలు సంధించి వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“రాప్తాడు అడుగుతోంది…. జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? సమాధానం చెప్పి సభ పెడతావా…. సభలో సమాధానం చెపుతావా? వైఎస్ జగన్ ” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్