Sunday, January 19, 2025
Homeసినిమా'లైగ‌ర్' ఫ్లాప్ - సోష‌ల్ మీడియాకు బ్రేక్

‘లైగ‌ర్’ ఫ్లాప్ – సోష‌ల్ మీడియాకు బ్రేక్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ ఎన్నో అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది.  ఇది విజ‌య్, పూరిలతో పాటు నిర్మాత ఛార్మికి పెద్ద షాక్.

ఫ‌స్ట్ డే నుంచే నెగిటివ్ టాక్ రావ‌డంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం ఓ రేంజ్లో ఉంటుందని చెప్పిన యూనిట్ ను ఇప్పుడు నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. . . ఈ క్రమంలో ఛార్మి కౌర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది.

‘గయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరి కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ  తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి.. బ్రతకనివ్వండి’ అంటూ హార్డ్ ఎమోజీని యాడ్ చేసి ఛార్మి  ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈసారి చాలా బిగ్ గా.. బెట‌ర్ గా వ‌స్తాను అన‌డంతో ఏ సినిమా చేయ‌నున్నారు..?  ఎవ‌రు న‌టించ‌నున్నారు..?  అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : టెన్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్