Sunday, January 19, 2025
Homeసినిమా'భోళాశంకర్' విషయంలో జరిగింది అదే!

‘భోళాశంకర్’ విషయంలో జరిగింది అదే!

Mini Review: కొన్ని కథలకు స్టార్స్ అవసరం లేదు .. కథనే అన్నీ తానై నడిపిస్తుంది. అలాంటి కథలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. చాలా సందర్భాల్లో  స్టార్స్ లేకుండా సినిమా అనేది వర్కౌట్ కాదు. కొన్ని కథలకు స్టార్స్ కావలసిందే. ఎందుకంటే స్టార్స్ ఇమేజ్ .. క్రేజ్ థియేటర్స్ కి జనాలను రప్పిస్తుంది. అంతేకాదు కొన్ని కథలను చెప్పడానికి స్టార్స్ కావలసిందే. వాళ్లు తమ స్టైల్లో చెప్పినప్పుడే ఆ కథలు ఆడియన్స్ కి ఎక్కుతాయి. అలా ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన సినిమానే ‘భోళాశంకర్’. ఇది చిరంజీవికి తగిన టైటిల్ .. తగిన కథ అనే చెప్పాలి.

ఇది గతంలో తమిళంలో అజిత్ హీరోగా చేసిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్. అయితే చిరంజీవి సినిమాను చూస్తున్నప్పుడు ఇది రీమేక్ కదా అనే దృష్టితో ఎవరూ చూడరు. కథ ఎలా ఉంది? .. మెగాస్టార్ ఎలా చేశారు? ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసింది అనేదే ఆడియన్స్ కి కావలసింది. చిరంజీవి డాన్సులు .. ఫైట్లు అదరగొట్టేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కామెడీ టైమింగ్ గురించి .. ఎమోషన్స్ ను పలికించే తీరును గురించి కూడా ఇప్పుడు కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన పాత్ర చుట్టూ ఉన్న కథ ఏమిటి? ఆ కథను ఎంత ఇంట్రస్టింగ్ గా చెప్పారు? అనేదే ఇక్కడ ముఖ్యం.

‘భోళాశంకర్’ విషయంలో ఆ కథను కరెక్టుగా ఒక ఫ్రెమ్ లో పెట్టేసి అందించడమే కుదరలేదనే టాక్ వినిపిస్తోంది.  ఫస్టాఫ్ లోనైనా .. సెకండాఫ్ లో నైనా చిరంజీవి చిరంజీవినే. ఆయన స్టైల్ ఆయనదే. అయితే ఆడియన్స్ ఆశించిన స్థాయిలో సన్నివేశాలను డిజైన్ చేయలేకపోయారు. అవసరం లేకపోయినా కామెడీని ఇరికించే ప్రయత్నం చేశారు. కామెడీ చేసే పాత్రల సంఖ్యను పెంచేశారు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది’ అనే సామెతనే ఇక్కడ గుర్తుకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అసలు విషయం ఉంది. కానీ అది చెప్పడానికి పెద్ద రాద్ధాంతమే చేశారు. కొన్ని అంశాలు బాగానే కుదిరాయి గానీ, లూజ్ సీన్స్ లేకుండా చూసుకుంటే మరింత బాగుండేదేమో అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్