Saturday, January 18, 2025
Homeసినిమాఆచార్య' అసంతృప్తికి సమాధానం 'గాడ్ ఫాదర్' 

ఆచార్య’ అసంతృప్తికి సమాధానం ‘గాడ్ ఫాదర్’ 

చిరంజీవి కథానాయకుడిగా ‘గాడ్ ఫాదర్‘ సినిమా రూపొందింది. ఎన్వీ ప్రసాద్ – ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి ‘అనంతపురం’లో జరిగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈవెంట్ కొనసాగింది. ఈవెంట్ ప్రారంభమైన కొంతసేపటికి జోరున వర్షం మొదలైంది. వరుణ దేవుడికి థ్యాంక్స్ అంటూ చిరంజీవి  అలా తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్టును గురించి గుర్తుపెట్టుకుని చిరంజీవి ప్రశంసించడం విశేషం. కథ వినకుండానే సల్మాన్ నేరుగా షూటింగుకి వచ్చేశాడంటూ ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పారు. నయనతార ఈ సినిమా చేయడానికి అంగీకరించడంతోనే సినిమా విజయానికి తొలిమెట్టు పడిందని అన్నారు. ఇక సత్యదేవ్ గొప్ప నటుడనీ, ఆయన సూపర్ స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారకుడు చరణ్ అంటూ ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పారు.

ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తి కలిగిందంటూ పరోక్షంగా ‘ఆచార్య’ సినిమాను గురించి ప్రస్తావించారు. తన అభిమానులను అలరించలేకపోయాననే అసంతృప్తికి సమాధానమే ‘గాడ్ ఫాదర్’ అని అన్నారు. తామంతా ఎంతగా కష్టపడినా అంతిమ న్యాయనిర్ణేతలు ప్రేక్షకులేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘గాడ్ ఫాదర్’ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ అంచనాలు పెంచారు. తనకి గాడ్ ఫాదర్ లేడని అంతా మాట్లాడుకుంటూ ఉంటారనీ, కానీ అభిమానుల రూపంలో  తనకి లక్షలాదిమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారంటూ అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించారు.

Also Read : అభిమానులను అలరించిన ‘గాడ్ ఫాద‌ర్’ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్